ఏ సమస్యకైనా పరిష్కారమంటు లభించండం అనుకున్నంత సులభము కాదు, అందుకనే మనకు సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఒక దృఢ నిశ్చయముతో, ధైర్యముగా ఎదుర్కోవాల్సిన అవసరము ఉంటుంది.
ముందుగా, మనకున్న సమస్యలేమిటో వాటిని చక్కగా అర్థము చేసుకొని వాటికి ఒక ఆచరణాత్మక విధానంలో పరిష్కారాన్ని వెతకాలి.
మనకున్న “నిత్యావసర సమస్యలైనా ”, “విద్యా సమస్యలైనా”, “ఆరోగ్య సమస్యలైనా”, “రైతుల సమస్యలైనా”, “ఉద్యోగ సమస్యలైనా”, “దీర్ఘకాలిక సమస్యలైనా” మరియు ఏ ఇతర సామాజిక సమస్యలైనా వాటన్నింటిని కూడా అందరికి చక్కగా అర్థమయ్యే రీతిలో ఇక్కడ మనము వ్యక్తపరుచుకోవచ్చును. దాని ద్వారా మన సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మీరు వ్యక్త పరిచిన సమస్యలను వార్త పత్రిక (News Paper) జర్నలిస్టులు మరియు దూరదర్శిని (Television) జర్నలిస్టులు చూసి మరింత సమాచారం కోసం మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలు పెరుగుతాయి.
మన సమస్యలను “ఉన్నది ఉన్నట్లు” ఇతరులను విమర్శించకుండా “గౌరవ ప్రదంగా” వ్యక్తపరుచవలెను, అప్పుడే మన సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం మొదలవుతుంది.
మన సమస్యలను ఎల్లప్పుడూ గౌరవ ప్రదంగా వ్యక్త పరుచుకోవాలి, అప్పుడు ప్రభుత్వ అధికారులైనా (Government Officers), స్వచ్చంద సేవ సంస్థలైనా (Non-Profitable Organizations), లేదా దేశ, విదేశాల్లో ఉన్న పరోపకారులైనా (Philanthropists) ముందుకు వస్తారు.
SAMASYALU.COM – IS AN ONLINE WEB PORTAL, TOTALLY COMMITTED AND DEDICATED TO SERVE THE PEOPLE OF BOTH THE TELUGU STATES WITH ITS ALTRUISTIC VISION TO IMPROVE THE QUALITY OF OUR LIVES BY BRINGING OUR SOCIAL PROBLEMS TO EVERYBODY’S ATTENTION – WITHOUT ANY DISCRIMINATION.